బి అలర్ట్ !!!


    భారత్ రాజధాని  ఢిల్లీలో ఓ మతస్తుల ప్రార్థనల అనంతర పరిణామాలు ఇప్పుడు కలవరానికి దారితీస్తున్నవి, న్యూఢిల్లీలోని మర్కజ్‌లో తగ్లిబీ జమాత్‌ నిర్వహించిన ప్రార్థనలు ఇప్పుడు కరోనా కేంద్ర బిందువుగా మారాయి.దేశంలో సుమారు 9వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరు వేల మందిని గుర్తించగా, మరో మూడు వేల మందిని గుర్తించాల్సి ఉంది.వీరికోసం  ఓ వైపు వెతుకులాట కొనసాగుతుండగాఇంకో షాక్ ఎదురైంది.విదేశీయుల్లో 187 మంది ఎక్కడున్నారనే వివరాలు దొరక్కపోవడం అనేది అసలు టెన్షన్​.


     ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కరోనా పాజిటివ్‌లుగా గుర్తించారు. వీరివల్ల ఇంకెంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారనే విషయం ఇప్పుడు పాలకులను ఆందోళనలకు గురిచేస్తోంది ప్రార్థనల అనంతరం వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరళి వెళ్లారు. ఇప్పుడు ఇదే అధికారులకు సమస్యగా మారింది. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొన్నవారు, వారితో సంబంధం ఉన్నవారే అధికంగా ఉన్నారు కనిపించకుండా పోయినవారి వల్ల ఎందరికి వ్యాధి వ్యాప్తించింది అనే విషయం పెద్ద ప్రశ్నగా మారింది.అర్ధం కావటంలేదు.


     187 మంది విదేశీయులు, 24 మంది భారతీయులు  పార్దనలో పాల్గొని కనిపించకుండాపోయిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలతో సుమారు 800 మందికిపైగా విదేశీయలుకు ప్రత్యక్ష సంబంధం ఉన్నది. వారిలో 477 మందిని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించారు.9వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో ఆరు వేల మందిని గుర్తించగా, మరో మూడు వేల మందిని గుర్తించాల్సి ఉన్నది.